నేటి ఆత్మీయ సందేశం (Today's Spiritual Message)
మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు, నిందలు, మనల్ని ద్వేషించే మనుషులు శత్రువుల్లా మనపైకి రావచ్చు. "నన్ను పడగొట్టడానికి ఇంతమంది ప్రయత్నిస్తున్నారు, నా పరిస్థితి ఏమిటి?" అని మనం భయపడవచ్చు. కానీ దేవుని బిడ్డలకు ఏ శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యుద్ధాలు మనం కాదు, మన దేవుడు పోరాడుతాడు. భక్తుడైన దావీదు శత్రువుల మధ్య చిక్కుకున్నప్పుడు కూడా పూర్తి నిశ్చయతతో పలికిన అద్భుతమైన మాట ఇది. కీర్తనలు 56:9 లో లేఖనం ఇలా సెలవిస్తోంది: "నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును."
దావీదుకు ఒక గొప్ప రహస్యం తెలుసు సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరకు వెళ్లడం కంటే, దేవుని సన్నిధిలో 'మొఱ్ఱపెట్టడం' (ప్రార్థించడం) ఎంతో శక్తివంతమైనది. మనం మోకరించి దేవునికి ప్రార్థించినప్పుడు, పరలోకపు సైన్యాలు మన పక్షాన కదులుతాయి. మనం శత్రువులతో పోరాడాల్సిన పని లేదు; మనం దేవునికి మొఱ్ఱపెట్టిన మరుక్షణమే మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు, సమస్యలు వెనుకకు తిరిగి పారిపోతాయి.
ఈ రోజు మీ జీవితంలో ఏ శత్రువు మిమ్మల్ని భయపెడుతున్నాడు? అది మనుషులు కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు లేదా భవిష్యత్తు గురించిన భయం కావచ్చు. వాటన్నింటి ఎదుట ధైర్యంగా నిలబడి, "దేవుడు నా పక్షమున ఉన్నాడు" అని విశ్వాసంతో ఒప్పుకోండి. విశ్వసృష్టికర్త మీ పక్షాన ఉన్నప్పుడు మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ రోజే మీ హృదయపూర్వకమైన మొఱ్ఱను దేవునికి వినిపించండి; మీ సమస్యలపై దేవుడు మీకు అద్భుతమైన విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆమేన్!
-----------------------------------------------------
In our lives, sometimes challenges, accusations, and people who dislike us can rise against us like enemies. We might grow fearful, wondering, "So many are trying to bring me down, what will happen to me?" But a child of God never needs to fear any adversary. For it is not we who fight our battles, but our God. David spoke these magnificent words with absolute certainty even when surrounded by his foes. Psalms 56:9 declares: "When I cry unto thee, then shall mine enemies turn back: this I know; for God is for me."
David knew a great secret that 'crying out' (praying) in the presence of God is far more powerful than running to humans when trouble strikes. The moment we kneel and pray, the hosts of heaven move on our behalf. We do not have to fight the enemies ourselves; the very instant we cry out to the Lord, the adversaries and problems troubling us are forced to turn back and flee.
What enemy is terrifying you in your life today? It could be difficult people, financial distress, sickness, or fear of the future. Stand courageously before them all and confess with faith, "God is for me." When the Creator of the universe is on your side, no weapon formed against you shall prosper. Lift your heartfelt cry to God today; He will grant you a glorious victory over every challenge. Amen!