నేటి ఆత్మీయ సందేశం (Today's Spiritual Message)
మన జీవితంలో ఆందోళన అనేది ఒక నిశబ్ద శత్రువు. రేపటి గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి మనం నిరంతరం చింతిస్తూ ఉంటాం. అయితే, చింతించడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు సరికదా, అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు 4:6 లో మనకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తున్నాడు: "దేనిని గూర్చియు చింతపకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి."
దేవుడు మనకు ఇస్తున్న సందేశం చాలా స్పష్టం: మీ భారాన్ని మీరే మోయకండి, దానిని ప్రార్థనగా మార్చి ఆయనకు అప్పగించండి. మనం 'కృతజ్ఞతతో' అడగడం అంటే, "ప్రభువా, నువ్వు నా ప్రార్థన వింటున్నావని నాకు తెలుసు, నువ్వు నాకు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను" అనే నిశ్చయతతో ఉండటం. చింత ఉన్న చోట ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉన్న చోట చింత నిలవదు.
మీరు ఈ రోజు ఏ విషయంలోనైనా కలత చెందుతున్నారా? అయితే ఆ విషయాన్ని దేవుని పాదాల చెంత పెట్టండి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి విషయాన్ని ఆయనకు తెలియజేయండి. మీరు మీ చింతను ఆయనకు అప్పగించినప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలపులకు కావలి ఉంటుంది. భయపడకండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. దేవుడు మీ ఆందోళనలను అద్భుతమైన సాక్ష్యాలుగా మారుస్తాడు. ఆమేన్!
-----------------------------------------------------
In our lives, anxiety is a silent enemy. We constantly worry about tomorrow, our children's future, or financial struggles. However, worry doesn't solve any problem; instead, it robs us of our peace of mind. This is why Apostle Paul shows us a wonderful solution in Philippians 4:6: "Be careful for nothing; but in every thing by prayer and supplication with thanksgiving let your requests be made known unto God."
God’s message to us is very clear: do not carry your burdens yourself; turn them into prayers and hand them over to Him. Asking 'with thanksgiving' means having the assurance that "Lord, I know You are hearing my prayer, and I believe You will help me." Where there is worry, there is no prayer, and where there is prayer, worry cannot remain.
Are you troubled about something today? If so, lay that matter at God's feet. Let Him know everything, whether big or small. When you surrender your anxieties to Him, the peace of God, which passes all understanding, will keep your hearts and minds. Do not be afraid; persevere in prayer. God will turn your worries into magnificent testimonies. Amen!