నేటి ఆత్మీయ సందేశం (Today's Spiritual Message)
ఈ లోకంలో మనం వెతుక్కునే సంతోషాలు తాత్కాలికమైనవి. ధనము, పదవి, మనుషుల ఆదరణ మనకు కొంత సమయం మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలవు. కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా మన హృదయాన్ని ఎల్లప్పుడూ సంతోషంతో నింపేది ఒక్క దేవుని సన్నిధి మాత్రమే. భక్తుడైన దావీదు కీర్తనలు 9:2 లో మహోన్నతుడైన దేవుని వైపు చూస్తూ ఇలా అంటున్నాడు: "మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను."
దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు, ఒడిదుడుకులు ఉన్నాయి. అయినా ఆయన సమస్యల వైపు చూడలేదు; తనను కాపాడే 'మహోన్నతుని' వైపు చూశాడు. మన దేవుడు అన్నిటికంటే పైనున్నవాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దేవునిని బట్టి సంతోషించడం అంటే.. మన ప్రార్థనకు ఇంకా జవాబు రాకపోయినా, పరిస్థితులు ఇంకా మారకపోయినా, "నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నాకు కార్యం చేస్తాడు" అని ముందే ఆనందించడం.
ఈ రోజు మీ జీవితంలో ఏ కొరత మిమ్మల్ని బాధపెడుతోంది? ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారా? అయితే లోకం వైపు చూడటం ఆపి, మహోన్నతుడైన దేవుని వైపు చూడండి. ఆయన మీ కన్నీళ్లను నాట్యంగా మార్చగలడు. మీ హృదయపూర్వకమైన స్తుతి మీ చుట్టూ ఉన్న బంధకాలను తెంచివేస్తుంది. మీ నోరు తెరిచి ఆయన నామాన్ని కీర్తించడం ప్రారంభించండి; దేవుడు తన అద్భుతమైన శాంతిని, సంతోషాన్ని మీ హృదయంలో కుమ్మరిస్తాడు. ఆమేన్!
-----------------------------------------------------
The happiness we seek in this world is often temporary. Wealth, status, and the approval of people can only give us fleeting joy. However, the only thing that can fill our hearts with everlasting joy, regardless of our circumstances, is the presence of God. In Psalms 9:2, David looks toward the Most High and declares: "I will be glad and rejoice in thee: I will sing praise to thy name, O thou most High."
David’s life was filled with many hardships, trials, and ups and downs. Yet, he did not look at his problems; he looked at the 'Most High' who protects him. Our God is above all things. When He is on our side, we have no reason to despair. Rejoicing in the Lord means being glad even before our prayers are answered or before circumstances change, fully believing that "My God is faithful, and He will work it out for me."
What lack is hurting you in your life today? Are people discouraging you? If so, stop looking at the world and lift your eyes to the Most High God. He is capable of turning your mourning into dancing. Your heartfelt praise can break the chains around you. Open your mouth and begin to sing praises to His name; God will pour out His wonderful peace and joy into your heart. Amen!